తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రజలకు సత్వర పోలీసింగ్ సేవలు అందించాలనే లక్ష్యంతో పొన్నలూరు పోలీస్ స్టేషన్ ఎస్సై గారు పోగొట్టుకున్న, దొంగిలించబడిన రెండు మొబైల్ ఫోన్లను గుర్తించి వాటి యజమానులకు అందజేశారు.
పొన్నలూరు గ్రామంలో సుమారు రూ.35,000 విలువైన ఒక దొంగిలించబడిన మొబైల్ ఫోన్‌ను గుర్తించి స్వాధీనం చేసుకుని యజమానికి అప్పగించారు. అలాగే నాగిరెడ్డిపాలెం గ్రామంలో ఒక అనుమానితుడి వద్ద నుంచి సుమారు రూ.15,000 విలువైన మరో దొంగిలించబడిన మొబైల్ ఫోన్‌ను రికవరీ చేసి సంబంధిత యజమానికి అందజేశారు.సాంకేతిక పరిజ్ఞానం, దర్యాప్తు నైపుణ్యంతో మొబైల్ ఫోన్లను గుర్తించిన పోలీసులు, బాధితులకు వాటిని తిరిగి అప్పగించి వారి ముఖాల్లో ఆనందాన్ని నింపారు.ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో లేదా సంబంధిత ఆన్‌లైన్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. ప్రజల ఆస్తుల రక్షణ, పోగొట్టుకున్న వస్తువుల రికవరీ విషయంలో ప్రకాశం జిల్లా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తున్నారని తెలిపారు.