google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-

ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తిని దగ్గరుండి అంబులెన్స్ లో ఎక్కించి హాస్పటల్ కు పంపించి మానవత్వం చాటుకున్నారు మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత గారు. వివరాల్లోకెళితే మార్కాపురం-తర్లుపాడు రోడ్డులో సోమవారం మధ్యాహ్నం రెండు మోటార్ సైకిల్ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడి రోడ్డు పక్కన పడిపోయాడు. కలెక్టరేట్ నుంచి మార్కాపురం పట్టణంలోకి వెళుతున్న జిల్లా కలెక్టర్ తన వాహనాన్ని ఆపి వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేయించి గాయపడ్డ వ్యక్తిని దగ్గరుండి అబులెన్స్ లో పంపించారు. దీంతో కలెక్టర్ సమయాస్ఫూర్తి, గొప్ప మనస్సు కు పలువురు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *