తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండ మండలం లోని ఎ. పి. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ నందలి 8వ తరగతి విద్యార్థులకు జిల్లా వనరుల కేంద్రం, ఒంగోలు వారు స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రాం గురించి శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో A. శైలజ రాణి, వ్యవసాయాధికారి, జిల్లా వనరుల కేంద్రం, ఒంగోలు వారు మట్టి నమూనా సేకరణ, ఆవశ్యకత, సేకరించే విధానం, ఉపయోగాలు, భూసార పరీక్షా ఫలితాల ఆధారంగా పంటల సాగు, సమస్యత్మక భూముల గుర్తింపు, వాటిని బాగు చేసే విధానం గురించి వివరించి మట్టి నమూనా సేకరించే డెమో గురించి వివరించి, చేసి చూపించినారు.ఈ కార్యక్రమం లో స్కూల్ సైన్స్ టీచర్ K. అన్నపూర్ణ గారు, AEO నజ్మా మరియు స్టూడెంట్స్ పాల్గొన్నారు.