google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కందుకూరు సీఐ, కందుకూరు టౌన్ ఎస్సై, కందుకూరు రూరల్ ఎస్సై సంయుక్తంగా కందుకూరు పట్టణ, గ్రామీణ పరిధిలోని లాడ్జీల యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి కౌన్సెలింగ్ అందించారు.ఈ సందర్భంగా లాడ్జీల్లో బస చేసే వారి గుర్తింపు పత్రాలను తప్పనిసరిగా నమోదు చేయాలని, సందర్శకుల వివరాలను రికార్డుల్లో పొందుపరచాలని, అనుమానాస్పద వ్యక్తులకు గదులు కేటాయించకూడదని సూచించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు అవకాశం కల్పించకుండా ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా అనుమానాస్పద పరిస్థితులు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో లాడ్జీల యజమానులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, చట్టపరమైన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed