తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
జీవో నెంబర్ 396 ను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖను ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం కందుకూరు శాఖ వారు చేస్తున్న దీక్షా శిబిరాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సందర్శించి తమ పూర్తి సంఘీభావాన్ని తెలియజేశారు. ప్రైవేటీకరణ ఆపే అంతవరకు మీతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యక్రమంలో ముందుంటుందని తెలిపారు. రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖను ప్రైవేటుపరం చేయటం వలన దీని మీదే ఆధారపడి జీవిస్తున్న దస్తావేజులు రాసే లేఖరులు, స్టాంపు వెండర్స్, డిటిపి ఆపరేటర్ల కుటుంబాలు తమ జీవనోపాధిని కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి వస్తుందని తెలిపారు. తక్షణం ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 396 ను ఉపసంహరించుకొని ప్రైవేటీకరణను నిలుపుదలచేయాలని డిమాండ్ చేశారు. మీ సమస్యను కందుకూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బుర్రా. మధుసూదన్ యాదవ్ దృష్టికి తీసుకువెళ్లి మీ డిమాండ్ కు మద్దతుగా సంఘీభావం తెలియ చేపిస్తామని అన్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా,రాష్ట్ర నాయకత్వం మరియు మాజీ ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి మీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు షేక్ రఫీ, రాష్ట్ర బూత్ కమిటీ జాయింట్ సెక్రెటరీ గణేశం గంగిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ముప్పవరపు కిషోర్, నియోజకవర్గ క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఉచ్చులూరి రవీంద్ర, పట్టణ ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ రహీం, గౌడ సంఘం అధ్యక్షులు కానాల శివప్రసాద్, సీనియర్ నాయకులు షేక్ నయీమ్, షేక్ కరిముల్లా తదితరులు పాల్గొన్నారు.