తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు దోనకొండ పోలీస్ స్టేషన్ పోలీసులు దొండపాడు గ్రామంలో రాత్రి వేళ నిర్వహించిన ప్రత్యేక దాడిలో జూదం ఆడుతున్న 4 మందిని పట్టుకున్నారు.ఈ దాడిలో వారి వద్ద నుంచి రూ.9,250 నగదుతో పాటు 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు.జిల్లాలో జూదం, చట్టవ్యతిరేక కార్యకలాపాలు మరియు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలపై కఠిన చర్యలు కొనసాగుతాయని, ప్రజలు ఇలాంటి అక్రమ కార్యకలాపాల గురించి సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని ప్రకాశం జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.