తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు నియోజకవర్గం లో జరుగుతున్న స్పెషల్ రివిజన్ ఇంటెన్సివ్ కార్యక్రమంలో జరుగుతున్న అవకతవకల గురించి అధికార పార్టీ అరాచకాల గురించి కందుకూరు సబ్ కలెక్టర్ మరియు ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ ని కలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్రాతపూర్వకంగా వినతి పత్రం అందించారు. అధికార పార్టీ నాయకులు నియోజకవర్గ వ్యాప్తంగా బి ఎల్ ఓ లను బెదిరించి మ్యాపింగు, డిజిటలైజేషన్ అయినా ఎన్యుమరేషన్ ఫారాలను తమ కార్యాలయాలకు తెప్పించుకొని వారి పార్టీ వ్యక్తిగత యాప్ లోకి డేటాను ఎంట్రీ చేసుకోవటానికి తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కందుకూరు పట్టణంలో అయితే అధికార పార్టీ నాయకులు సచివాలయాలకు కూడా వైఎస్ఆర్సిపి బిఎల్ఎ లను ఎందుకు వస్తున్నారని బెదిరించే దోరణితో వ్యవహరిస్తున్నారని తెలిపారు. మండల స్థాయిలో బిఎల్ఓ పై జరుగుతున్న దౌర్జన్యాలను మండల ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ల దృష్టికి తీసుకువెళ్తే స్పందించడం లేదని సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ విషయాలపై వెంటనే స్పందిస్తానని అవసరమైన దగ్గర చర్యలు తీసుకుంటానని తెలపడం జరిగినది.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు షేక్ రఫీ, రాష్ట్ర బూత్ కమిటీ జాయింట్ సెక్రెటరీ గణేశం గంగిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ముప్పవరపు కిషోర్, నియోజకవర్గ క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఉచ్చులూరి రవీంద్ర, పట్టణ ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ రహీం, గౌడ సంఘం అధ్యక్షులు కానాల శివప్రసాద్, సీనియర్ నాయకులు షేక్ నయీమ్, షేక్ కరిముల్లా తదితరులు పాల్గొన్నారు.