google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

కందుకూరు సర్కిల్ పరిధిలోని హోటల్లు మరియు లాడ్జి ల యజమానులతో కందుకూరు సిఐ షేక్ అన్వర్ భాషా గారు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హోటల్, లాడ్జి యజమానులకు కొన్ని సూచనలు,సలహాలు మరియు హెచ్చరికలు చేశారు. ప్రతి ఒక్క లాడ్జిలో తప్పనిసరిగా సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని లాడ్జిలకు వచ్చే ప్రతి ఒక్కరి గుర్తింపు కార్డులను సేకరించి వారి యొక్క వివరాలను సంబంధిత రిజిస్టర్ లలో నమోదు చేయాలని, అసాంఘిక కార్యక్రమాలు అనగా పేకాట,వ్యభిచారం, బెట్టింగ్,మట్కా, గంజాయి సేవించడం లేదా కలిగి ఉండటం మొదలగు కార్యక్రమాలు జరగనీయకుండా చూసుకోవాలని,అసాంఘిక కార్యక్రమాలు చేయుటకు సహకరించిన లాడ్జి యజమానులపై కూడా కేసులు నమోదు చేసి చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఎవరైనా అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నట్లయితే వారి గురించి పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కందుకూరు పట్టణ ఎస్సై పులి శివ నాగరాజు గారు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed