ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐ.పి.ఎస్., గారి ఆదేశాల మేరకు, దర్శి డీఎస్పీ శ్రీ పి. బాలమురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం 8 గంటల నుంచి 9 గంటల వరకు ముండ్లమూరు మండలం, ముండ్లమూరు గ్రామ శివారులోని యానాది కాలనీలో పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి ఆకస్మిక కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.దర్శి సీఐ వై. రామారావు, ముండ్లమూరు ఎస్సై కోటేశ్వరరావు, కురిచేడు, దొనకొండ ఎస్సైలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొని కాలనీలోని పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.ఇటీవల జరుగుతున్న ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనాలతో పాటు ఇతర నేరాలను అరికట్టడం, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించడం, ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ తనిఖీలు నిర్వహించారు.తనిఖీల అనంతరం దర్శి డీఎస్పీ శ్రీ పి. బాలమురళీకృష్ణ గారు కాలనీవాసులతో సమావేశమై పలు సూచనలు చేశారు. కాలనీలోకి కొత్తగా లేదా అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, నేరాలకు దూరంగా ఉంటూ మంచి నడవడికతో జీవనం సాగించాలని, ఎలాంటి క్రిమినల్ కేసుల్లో చిక్కుకోకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.ప్రజల భద్రత – నేరాల నియంత్రణే ప్రకాశం జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *