రాష్ట్రంలోని పాత్రికేయులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం చేస్తామని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉప్పల్ లక్ష్మణ్, అధ్యక్షులు రవితేజ స్పష్టం చేశారు. రాష్ట్ర అధ్యక్షులు రవితేజ అధ్యక్షతన నెల్లూరు జిల్లాలో జాప్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్ యుజె ప్రధాన కార్యదర్శి రవి మీనాక్షి సుందరంతో పాటు 13 జిల్లాల జాప్ అధ్యక్ష, కార్యదర్శులతో పాటు, కావాలి నియోజకవర్గం ఎం.. ఎల్ ఎ కృష్ణారెడ్డి, పలువురు ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉప్పల్ లక్ష్మణ్, రవితేజ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. నిరంతరం జాప్ జర్నలిస్టుల ప్రయోజనాలు పరిరక్షిస్తూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని పునరుద్ఘాటించారు. జర్నలిస్టుల హక్కుల సాధన ప్రయోజనాల పరిరక్షణలో రాజీ పడే ప్రసక్తే లేదని ఉప్పల్ లక్ష్మణ్, రవితేజ స్పష్టం చేశారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్ యు జె ప్రధాన కార్యదర్శి రవి మీనాక్షి సుందరం మాట్లాడుతూ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పాత్రికేయుల కోసం చేస్తున్న పోరాటాలను కొనియాడారు. జాప్ ఎన్నో పోరాటాలు చేసి విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్ర స్థాయిలో జర్నలిస్టుల పరిష్కారానికి ఎన్ యుజె కృషి చేస్తోందని చెప్పారు.ఈ సమావేశంలో జాప్ విశాఖ అధ్యక్షులు కే ఎం కీర్తన్ మాట్లాడుతూ జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా విశాఖలో ముందే నిలబడి పోరాటం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న కొన్ని జీవోలు వలన జర్నలిస్టులకు తీవ్ర ఇబ్బందులు ఉన్నాయన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో తమ శాఖ మరిన్ని ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తుందని చెప్పారు. పాత్రికేయుల సమస్యలతో పాటు వారికి ఏ కష్టం వచ్చినా తాము అండగా నిలబడుతున్నామని కీర్తన్ తెలియజేశారు. ఇందుకు సహకరిస్తున్న జాప్ రాష్ట్ర కార్యవర్గానికి, విశాఖ జిల్లా శాఖ కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జాప్ ఎ. పి. ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణరెడ్డి, ఎన్ యూ జే(ఐ) జాతీయ ఉపాధ్యక్షులు ఉక్కల్ కర్ రాజేందర్ నాథ్, టీ జే ఎ రాష్ట్ర అధ్యక్షులు రమణ రావు, ప్రధాన కార్యదర్శి గౌరీ, జాప్ ప్రతినిధులు భాను, విజయవాడ, సత్యనార్యానాయణ, విజయనగరం జాప్ ఎ. పి. ఉపాధ్యక్షులు సత్యనారాయణ ,, విశాఖపట్నం జాప్ ప్రధాన కార్యదర్శి జై. వి. కె. అప్పలరాజు, జాప్ వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు హాజరయ్యారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *