తొలి శుభోదయం న్యూస్ అమరావతి:-
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా తూమాటి మాధవరావు గారు ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు సమక్షంలో మాధవరావు ప్రమాణ స్వీకారం నిర్వహించారు.డిప్యూటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాధవరావుగారికి పలువురు ఎమ్మెల్సీలు, రాజకీయ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. సభా వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ సభ్యుల సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.శాసనమండలిలో ప్రజా సమస్యలపై చర్చలకు ప్రాధాన్యం ఇస్తామని, సభా గౌరవాన్ని కాపాడుతూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తానని మాధవరావు గారు పేర్కొన్నారు.కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్సీలు, శాసనమండలి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.