కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా చేపట్టిన 45 రోజుల ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో భాగంగా దర్శి పట్టణంలోని 5వ వార్డులో శనివారం సాయంత్రం దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిశారు.గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, దర్శి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలతో కూడిన ప్రగతి నివేదికలను ప్రజలకు అందజేశారు.ప్రతి కార్యకర్త ఉత్సాహంగా పాల్గొని ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలను ప్రజలకు వివరించడంతో పాటు, ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, వైస్ చైర్మన్ గర్నిపూడి స్టివెన్, టౌన్ టీడీపీ అధ్యక్షులు చిన్నా, టీడీపీ నాయకులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *