తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-
డీజే సౌండ్ సిస్టమ్ వినియోగంపై నిబంధనలు వివరిస్తూ.. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులకు సూచనలు గణేష్ ఉత్సవాలు, విగ్రహ నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించే లక్ష్యంతో మార్కాపురం జిల్లా పోలీసులు డీజే సౌండ్ సిస్టమ్ నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా డీజే నిర్వాహకులకు శబ్ద కాలుష్య నియంత్రణ, అనుమతులు, సమయపాలన, ప్రజలకు ఇబ్బంది కలగకుండా సౌండ్ సిస్టమ్ల వినియోగం, ఊరేగింపుల సమయంలో పాటించాల్సిన భద్రతా నిబంధనలపై పోలీసులు అవగాహన కల్పించారు.గణేష్ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసుల సూచనలు, ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని నిర్వాహకులకు స్పష్టం చేశారు. ముఖ్యంగా అధిక శబ్దంతో డీజేలు నిర్వహించడం, ప్రజలకు, విద్యార్థులకు, వృద్ధులకు, అనారోగ్యంతో ఉన్నవారికి అసౌకర్యం కలిగించే విధంగా వ్యవహరించరాదని సూచించారు.ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో జరిగేలా డీజే నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.ప్రజల భద్రత – ప్రశాంతమైన ఉత్సవాలే లక్ష్యం.. నిబంధనలు పాటిస్తూ గణేష్ ఉత్సవాలను విజయవంతం చేద్దాం!