తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:-
వెలిగొండ ప్రాజెక్టు నీటిని కనిగిరి నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు మళ్లించేలా చర్యలు చేపట్టాలని ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కనిగిరిలో అధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో ఆయన వెలిగొండ ప్రాజెక్ట్ నీటి లభ్యత, వినియోగంపై సమగ్రంగా చర్చించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నియోజకవర్గంలోని ఆరు మండలాలకు తాగు, సాగునీరు అందేలా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలన్నారు. నియోజకవర్గంలో ప్రతి ఎకరాకూ సాగునీరు అందించడంతో పాటు, ప్రతి ఇంటికీ మంచినీరు సరఫరా చేయడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగా ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన ప్రణాళికలు (మాస్టర్ ప్లాన్) రూపొందించాలని సూచించారు. పనులను వేగవంతం చేసి, నీటి సరఫరా లో ఎలాంటి అవరోధాలు లేకుండా చూడాలని ఆదేశించారు.