మార్కాపురం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో “పల్లె నిద్ర” కార్యక్రమం ద్వారా పోలీసులు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మరింత చేరువవుతున్నారు. గ్రామాల్లో రాత్రి వేళల్లో బస చేస్తూ ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించడంతో పాటు, స్థానిక సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడుతున్నారు.గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ మద్యం, జూదం, గంజాయి మరియు ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, ప్రాంతాలపై నిఘా కొనసాగిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపడుతున్నారు.అలాగే గ్రామాల్లోని ప్రజలు, యువత, మహిళలు, వృద్ధులతో పోలీసులు మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, ట్రాఫిక్ నిబంధనలు, మహిళలు మరియు బాలల భద్రతపై అవగాహన కల్పిస్తున్నారు.ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారనే భరోసా కల్పిస్తూ, “ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన బాధ్యత” అనే లక్ష్యంతో మార్కాపురం జిల్లా పోలీసులు పల్లె నిద్ర కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.గ్రామాల్లో పోలీసుల ప్రత్యక్ష పర్యవేక్షణ.. ప్రజల్లో భద్రతపై మరింత నమ్మకం – ఇదే పల్లె నిద్ర కార్యక్రమం లక్ష్యం.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *