కొండపి నుంచి ఒంగోలు–నంద్యాల రహదారిలో నెన్నూరుపాడు, గుర్రప్పడియ, మూగచింతల గ్రామాల్లో రూ.2 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్డును రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి గారు ప్రారంభించారు.గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పిస్తూ, ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొండపి నియోజకవర్గంలో ఇప్పటివరకు రూ.51.51 కోట్ల విలువైన R&B రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి గారు తెలిపారు.ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తూ కొండపి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *