అర్జీలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఎస్పీ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల సమస్యలను విని, వారు అందజేసిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించారు. సంబంధిత పోలీస్ అధికారులకు ఫోన్ చేసి, పి.జి.ఆర్.ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను చట్టపరిధిలో విచారించి నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలన్నారు. కుటుంబ కలహాలు, భర్త, అత్తింటి వేధింపులు, స్థల వివాదాలు, ఆర్థిక లావాదేవీల మోసాలు తదితర పలు సమస్యలపై మొత్తం 36 మంది అర్జీదారులు అర్జీలు అందజేశారు.పోలీస్ స్టేషన్, కార్యాలయాలకు వచ్చే ఫిర్యాదీదారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, అర్జీలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ఎస్పీ పోలీస్ అధికారులను ఆదేశించారు. పోలీస్ శాఖ చట్టపరిధిలో పరిష్కరించడానికి సాధ్యంకాని అర్జీలకు సంబంధించి వాటి పరిష్కారం కోసం ఎవరిని సంప్రదించాలో అర్జీదారులకు స్పష్టంగా తెలియజేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సీసీఎస్ డిఎస్పీ పి.జగదీష్ నాయక్, పిజిఆర్ఎస్ సెల్ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు, ఎస్.ఐ లక్ష్మి రాజ్యం తదితర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *