రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సామాన్యులకు ఆదర్శంగా నిలిచారు. సోమవారం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడు పాలెంలోని తన స్వగృహానికి సంబంధించి 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఆయన ముందస్తుగా ఇంటి పన్ను చెల్లించారు. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శికి పన్ను మొత్తాన్ని అందజేసి రశీదు పొందారు.మే 31లోపు చెల్లిస్తే 5 శాతం రిబేటు
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు. సకాలంలో పన్నులు చెల్లించడం ద్వారానే పంచాయతీల్లో మౌలిక వసతుల కల్పన సాధ్యమవుతుందన్నారు.”ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2026-27 సంవత్సరానికి సంబంధించి మే 31వ తేదీలోపు ముందస్తుగా ఇంటి పన్ను చెల్లించే వారికి 5 శాతం రాయితీ (రిబేటు) లభిస్తుంది. ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలి.” అని ఆయన కోరారు.అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
ముందస్తు పన్ను చెల్లింపు ద్వారా ఆర్థిక వెసులుబాటు పొందడమే కాకుండా, గ్రామ ప్రగతికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా తోడ్పడాలని మంత్రి పిలుపునిచ్చారు. బాధ్యతాయుతమైన పౌరులుగా పన్నులు చెల్లించి గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకుందామని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *