బాపట్ల జిల్లా కేంద్రంగా రూపాంతరం చెంది, ప్రముఖ విద్యా, పర్యాటక , ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వంటి కీలక కేంద్రాలకు నిలయంగా ఉన్న నేపథ్యంలో, స్థానిక రైల్వే మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం బాపట్ల పార్లమెంట్ సభ్యులు,లోక్‌సభ ప్యానల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్ కు ఆదివారం పట్టణ ప్రముఖులు విన్నవించారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ డాక్టర్ బి. శరత్ బోస్ నేతృత్వంలో పౌర సమాఖ్య, మహిళా సమైక్య, శ్రీ భావపురి ఎడ్యుకేషనల్ సొసైటీ, జనవిజ్ఞాన వేదిక, రోజ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఈరోజు ఎంపీని కలిసి అభ్యర్థన పత్రం అందజేశారు. నిత్యం వేలాది మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ వంటి సుదూర ప్రాంతాలకు ప్రయాణించే బాపట్లలో రైల్వే సదుపాయాలను మరింత పెంచాలని వారు కోరారు.
ముఖ్యంగా గతంలో హాల్టింగ్ ఉండి రద్దయిన గ్రాండ్ ట్రంక్ (జీటీ) ఎక్స్‌ప్రెస్, తిరుపతి – సాయి నగర్ షిరిడి ఎక్స్‌ప్రెస్‌లను పునరుద్ధరించడంతో పాటు.. జనశతాబ్ది, పద్మావతి, చార్మినార్, తిరుపతి – విశాఖపట్నం డబుల్ డెక్కర్ , ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ – హజరత్ నిజాముద్దీన్ గరీబ్ రథ్ వంటి సూపర్ ఫాస్ట్ రైళ్లకు బాపట్ల స్టేషన్‌లో హాల్టింగ్ కల్పించాలని విన్నవించారు. అలాగే పెరుగుతున్న రద్దీ దృష్ట్యా ప్లాట్‌ఫారమ్‌ల ఆధునీకరణ, నూతన అండర్ బ్రిడ్జిలు, ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి చొరవ చూపాలని ఎంపీని కోరుతూ, జిల్లా అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అంగులూరి హరిప్రసాద్, కాల శ్రీనివాసరావు, ప్రముఖ న్యాయవాది తోట రామాంజనేయులు, కరుణో రవీంద్రబాబు, కోలా సుబ్బారావు, గొల్ల ఏకాక్షరి, కోట వెంకటేశ్వర రెడ్డి, గురజాల శ్రీనివాసరావు, ఆవుల వెంకటేశ్వర్లు, పొందుగల ప్రసాద్, పాలేరు వీరాస్వామి, కుర్ర కృష్ణ భగవాన్, చిలకా సురేంద్రనాథ్, ఉప్పే నరసింహారావు, తడికమళ్ళ నాగేంద్రప్రసాద్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *