తొలి శుభోదయం న్యూస్ కొవ్వూరు నియోజకవర్గం :-
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న“మహానాడు–2026” ను మే 27, 28, 29 తేదీలలో నెల్లూరు జిల్లా, కొడవలూరు మండలంలోని కిసాన్ సెజ్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించేందుకు పార్టీ నిర్ణయించింది.ఈ మహాసభలను విజయవంతం చేయాలనే లక్ష్యంతో కోవూరు మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించడం జరిగింది. కార్యక్రమం విజయవంతం దిశగా తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించాము.మహానాడు–2026ను ఘన విజయం సాధించేలా అందరూ ఐక్యంగా కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులకు, కార్యకర్తలకు తెలియజేస్తున్నాను.