తొలి శుభోదయం న్యూస్ కంభం:-
తహసీల్దార్ కార్యాలయం, కంభం మండలం శ్రీయుత జాయింట్ కలెక్టర్, మార్కాపురం వారి ఆదేశముల మేరకు కంభం మండలంలోని మొత్తం 31 రేషన్ దుకాణాలకు సంబంధించిన రేషన్ కార్డులలో కుటుంబ సభ్యుల e-KYC నమోదు ప్రక్రియపై ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించబడినది.
ఈ సమావేశం తహసీల్దార్, కంభం మరియు ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ ఆధ్వర్యంలో రేషన్ డీలర్లతో నిర్వహించబడినది. మండల పరిధిలోని రేషన్ కార్డులలో ఇప్పటివరకు e-KYC చేయించని 1339 మంది కుటుంబ సభ్యుల జాబితాను సంబంధిత డీలర్లకు అందజేయడమైనది.
సదరు జాబితాలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యునికి తప్పనిసరిగా e-KYC ప్రక్రియను సంబంధిత రేషన్ దుకాణములోని e-Pos యంత్రం ద్వారా పూర్తి చేయించవలెనని డీలర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వబడినవి. ఈ ప్రక్రియను రాబోయే సోమవారం సాయంత్రం లోపు పూర్తిచేయాలని సూచించబడినది.
అలాగే, e-KYC నమోదు చేయించని కుటుంబ సభ్యుల వివరాలు భవిష్యత్తులో “Inactive” స్థితిలోకి వెళ్లే అవకాశముండి, అట్టి సభ్యులకు రేషన్ బియ్యం సరఫరా నిలిచిపోవచ్చునని తెలియజేయడమైనది.
కాబట్టి, మండలంలోని రేషన్ కార్డు దారులు తమ కుటుంబ సభ్యులందరి e-KYC ప్రక్రియను తక్షణమే పూర్తి చేయించుకొని ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను నిరంతరంగా పొందవలెనని తహసీల్దార్, కంభం వారు ప్రజలకు విజ్ఞప్తి చేయుచున్నారు.