ప్రకాశం జిల్లా పోలీసుల ‘స్కై ఐ ప్రకాశం’ ప్రాజెక్ట్‌లో భాగంగా అక్రమ కార్యకలాపాల నివారణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పొన్నలూరు ఎస్సై గారి ఆధ్వర్యంలో మాలపాడు అటవీ ప్రాంతంలో డ్రోన్ కెమెరాతో ప్రత్యేక నిఘా నిర్వహించారు.అటవీ ప్రాంతాల్లో జరిగే అక్రమ కార్యకలాపాలు, అనుమానాస్పద కదలికలు మరియు చట్టవిరుద్ధ చర్యలను గుర్తించేందుకు ఆకాశ మార్గం ద్వారా విస్తృతంగా పర్యవేక్షణ చేపట్టారు. డ్రోన్ సర్వైలెన్స్ ద్వారా చేరుకోలేని ప్రాంతాలను సైతం నిశితంగా పరిశీలిస్తూ పరిస్థితులను అంచనా వేశారు.ప్రజా భద్రత, నేరాల నివారణ మరియు అక్రమ కార్యకలాపాల అరికట్టడంలో భాగంగా ప్రకాశం జిల్లా పోలీసులు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ అప్రమత్తంగా పనిచేస్తున్నారు. ప్రజలు అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *