టంగుటూరు మండలంలోని పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు సందర్శించిన ఆయన గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా రైతులతో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జ్ మరియు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యులు డా. ఆదిమూలపు సురేష్ . కష్టపడి పండించిన పంటకు కనీస మద్దతు ధర లేకపోతే రైతులు అప్పుల పాలుకాక ఏమవుతారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో రైతులకు కొండంత ఆశలు చూపి, అధికారంలోకి వచ్చాక వారిని విస్మరించడం దారుణమని ధ్వజమెత్తారు. రైతు సంక్షేమం కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పోరాడుతుందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైయస్ఆర్ సీపీ నాయకులు, స్థానిక కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *