తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు:-

గుడ్లూరు మండలంలోని మోచర్ల గ్రామపంచాయతీ నందు కిషోరీ వికాసం బాల బాలికలకు వేసవికాలంలో శిక్షణ కార్యక్రమం జరపడమైనది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎంపీడీవో వై వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన బాల బాలికలకు నా అవసరాలు మరియు మన సవాళ్లు అనే విషయంపై మాట్లాడటం జరిగింది. సూపర్వైజర్ కామేశ్వరి మాట్లాడుతూ కిషోర్ ఈ బాలికలు ఆత్మవిశ్వాసం నాయకత్వం లక్షణాలను కలిగి ఉండాలని ప్రతి బాలిక గౌరవంగా జీవించే హక్కును కలిగి ఉండాలని. బాలికలు తన భావాలు మరియు అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరచడం నేర్చుకుని ఉండాలని. బాలికల భద్రత ఆరోగ్యం మరియు విద్య పై అవగాహన పెంపొందించాలని. ప్రతి బాలిక గౌరవంగా జీవించే హక్కును కలిగి ఉండాలని. అవసరాలను గుర్తించడం. సమస్యలను కలిసి పరిష్కరించుట విద్య ఆరోగ్యం మరియు భద్రత భవిష్యత్తును నిర్మిస్తాయని. ధైర్యంగా మాట్లాడటం ద్వారా మార్పు సాధ్యమవుతుందని. పరస్పర సహకారం బలంగా మారుస్తుందని సూపర్వైజర్ కామేశ్వరి బాలబాలికలకు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో గుడ్లూరు మండలం ఎంపీడీవో వై వెంకటేశ్వరరావు. డిప్యూటీ ఎంపీడీవో విజయభాస్కర్.సూపర్వైజర్ కామేశ్వరి. పంచాయతీ సెక్రెటరీ లూథర్ భూపతి. అంగన్వాడీ కార్యకర్తలు. చేవూరు వరలక్ష్మి. ఆలూరి కొండమ్మ. తలకాయల ప్రశాంతి. కే అనురాధ. ప్రసన్న. వీఆర్వో పద్మజ. కిషోర్ బాలికలు మరియు బాలురు తల్లిదండ్రులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *