తొలి శుభోదయం న్యూస్ బుచ్చిరెడ్డిపాలెం :-
బుచ్చిరెడ్డిపాలెం మండలం జోన్నవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయీ అమ్మవారి దేవస్థానం లో బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి.
శుక్రవారం నిర్వహించిన మహా రథోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించాను.ఈ సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరాలయం నుండి వచ్చిన శాశ్వత సారెను అమ్మవారికి సమర్పించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మేళతాళాలు, భక్తుల జయజయధ్వానాల మధ్య రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.