సింగరాయకొండ మాజీ సర్పంచ్ షేక్ సందాని భాషా భార్య సమీమును కొండేపి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దామచర్ల పూర్ణచంద్రరావు పరామర్శించారు. సమీము గత కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో మోకాలి శస్త్రచికిత్స చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న పూర్ణచంద్రరావు వారి నివాసానికి చేరుకుని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పూర్ణచంద్రరావు వెంట తెలుగుదేశం పార్టీ టౌన్ అధ్యక్షుడు షేక్ యస్దాని, పటాన్ సల్మాన్ ఖాన్, ముస్లిం సోదరులు, పార్టీ నాయకులు మరియు అభిమానులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *