తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
విధినిర్వహణ లో కార్యక్షేత్రం లో ఎక్కడైనా లోపాలు చోటు చేసుకుంటే పోలీస్ పరంగా సరిదిద్దుకుంటామని మీడియా కూడా అదే విధంగా సమన్వయం తో సహకరించాలని సింగరాయకొండ సి ఐ వై శ్రీహరి మీడియా ప్రతినిధులకు పిలుపు ఇచ్చారు . శుక్రవారం సాయింత్రం సింగరాయకొండ పోలీస్ సర్కిల్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన సింగరాయకొండ, జరుగుమల్లి ఎస్సై ల మీడియా ప్రతినిధుల పరిచయ కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ మీడియాది స్నేహ పూర్వక బంధం అని ప్రజలకు సత్వర న్యాయం రక్షణ కల్పించడం లో సమన్వయంతో పని చేద్దామని కోరారు.విధినిర్వహణ లో అక్కడక్కడ పొరపాట్లు చోటు చేసుకుంటాయని వాటిని సానుకూలంగా అర్థం చేసుకుని సహకరించాలని సి ఐ శ్రీహరి కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రహసనం మొదలయిందని ఇంకా ప్రకటన రావాల్సి ఉంది కనుక ఇప్పటి నుండి శాంతి భద్రతల పరిరక్షణ కోసం కలిసి సేవలు అందించాలనింకోరారు. సర్కిల్ పరిధిలో సింగరాయకొండ, జరుగుమల్లి, టంగుటూరు పోలీస్ స్టేషన్ ల పరిధిలో ప్రజలు పోలీస్ కి సహకరించాలని చెడునడత గల వారి సమాచారం, సంఘ విద్రోహ కార్యక్రమాలు, చెడు వ్యసనాలు,గంజాయి సరఫరా చెలామణి,జూదం, బెట్టింగ్ నేరాల నియంత్రణ, దొంగతనాలు అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి పెట్టి అవసరమైన చర్యలు చేపడతామని సి ఐ వివరించారు.గృహ దోపిడీలు,దొంగతనాల నివారణ లో భాగంగా ఎల్ హెచ్ ఎం ఎస్ విధానాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వివిధ యాజమాన్యాల కింద సేవలు అందిస్తున్న వృత్తి జర్నలిస్ట్ లు ప్రత్యేకించి సింగరాయకొండ కేంద్రానికి సంబంధించి పలు సమస్యలను ఆయన దృష్టిలో పెట్టి శాంతి భద్రతలు పరిరక్షణ , రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సి ఐ దృష్టికి తీసుకు వెళ్ళారు. వృత్తి జర్నలిస్ట్ లు తమ దృష్టికి తెచ్చిన సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సింగరాయకొండ ఎస్సై లేళ్ల సుధీర్ కుమార్, జరుగుమల్లి ఎస్సై పి భాగ్యరాజ్ లను సింగరాయకొండ మీడియా ప్రతినిధులకు పరిచయం చేశారు. అనంతరం వివిధ యాజమాన్యాల కింద సేవలు అందిస్తున్న మీడియా ప్రతినిధులు వ్యక్తిగతంగా వాటిని పరిచయం చేసుకున్నారు.
