డెంగ్యూ వ్యాధి నివారణ మనందరి బాధ్యత అని కందుకూరు లోని జనార్ధన కాలనీ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాII స్టెల్లా కారుణ్య అన్నారు. జాతీయ డెంగ్యూ నివారణా దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన ర్యాలీని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత విషయమై ప్రజలలో అవగాహన పెంచడానికి సామూహిక సమావేశాలు ప్రార్థన సాధనాలని, ఆ సమావేశాల్లో డెంగ్యూ వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కలిగే దుష్పరిణామాల గురించి ప్రజలను చైతన్య పరచాలని సిబ్బందికి సూచించారు. ర్యాలీ అనంతరం మానవహారంగా ఏర్పడి అందరిచేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఇన్ ఛార్జ్ ఏ.యం. ఓ. జీవివి ప్రసాద రావు, డిప్యూటీ ఎంపీడీవో లు వెంకటేశ్వర్లు, వెంకటేశ్వరరావు, cho శ్రీనివాసులు, phn పద్మావతి, ఏఎన్ఎం లు, ఆశా కార్యకర్తలు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *