google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ఆదివారం స్థానిక కోటారెడ్డిభవన్లో దళిత హక్కుల పోరాట సమితి కందుకూరు నియోజకవర్గం జనరల్ బాడీ సమావేశం గద్దల రవి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డిహెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి తరాలు మారిన దళితుల బ్రతుకులు మారటం లేదని తినే తిండి పైన కట్టుకునే గుడ్డ పైన ఆంక్షలు విధిస్తూ దాడులకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు సక్రమంగా అమలు చేయకుండా ప్రభుత్వాలు కాలయాపన చేయటం వల్ల దళిత గ్రామాలు అభివృద్ధికి నోచుకోకుండా ఇప్పటికే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉన్నది. ఎన్నికల్లో దళితులు ఓట్లు రాబట్టుకోవటానికి అనేక హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచినక ఇచ్చిన హామీలను మర్చిపోతున్నటువంటి పాలకుల్ని గుర్తించుకొని మరల ఎన్నికలు వచ్చేటప్పుడు తగు బుద్ధి చెప్పాలని ఆయన అన్నారు. అదేవిధంగా మహిళా సంఘం జిల్లా గౌరవాధ్యక్షురాలు సుదర్శి రావమ్మ మాట్లాడుతూ ఎన్ని బతుకులు మారిన దళితుల బతుకులు మారవు అని అంబేద్కర్ జయంతులకు వారి ఆశయాలు కొనసాగిస్తామని మహాసభలు సాక్షిగా మాటలు చెప్పి తరువాత వారు చేసే పని వారు చేస్తున్నారని దళితులపై దాడులను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో డిహెచ్ పి ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్తన్న అంజయ్య, సిపిఐ కందుకూరు నియోజకవర్గ కార్యదర్శి డి సురేష్ బాబు, తదితరులు పాల్గొని మాట్లాడినారు. అనంతరం కందుకూరు నియోజకవర్గం కమిటీని ఎన్నుకోవడం జరిగింది. గౌరవాధ్యక్షులుగా పొంతగాని మాధవ రావు, అధ్యక్షులు డి నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా నత్తా రామారావు, ఉపాధ్యక్షులుగా దాసరి రమేష్, డి కోటేష్, సహాయ కార్యదర్శిగా చదలవాడ సురేష్, డి మట్టయ్య, కోశాధికారిగా జమ్మలమడుగు రవి ను ఎన్నుకోవడం జరిగింది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed