తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
రామాయపట్నం పోర్టు కోసం భూములు త్యాగం చేసిన కర్లపాలెం ST కాలనీవాసులకు ఇచ్చిన మాటను మా కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. సబ్ కలెక్టర్ దామెర హిమవంశీ గారితో కలిసి 80 మంది లబ్ధిదారులకు లాటరీ ద్వారా 5 సెంట్ల చొప్పున ప్లాట్లు కేటాయించి, ఇళ్ల పట్టాలు అందజేశాం.మొత్తం 8.26 ఎకరాల్లో, ₹7.28 కోట్ల వ్యయంతో CC రోడ్లు, తాగునీరు, విద్యుత్, కమ్యూనిటీ హాల్ వంటి అన్ని ఆధునిక వసతులతో ఈ కాలనీని ఒక ఆదర్శ లేఅవుట్గా తీర్చిదిద్దుతాం. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ న్యాయం చేయడమే మా లక్ష్యం.