ప్రజల్లో భద్రతా చైతన్యం పెంపొందించడం, నేరాల నివారణ, మహిళలు మరియు చిన్నారుల రక్షణను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా మార్కాపురం జిల్లా పోలీసులు జిల్లావ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, మహిళలు మరియు చిన్నారులపై నేరాలు, ఈవ్‌టీజింగ్, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు వంటి కీలక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.మహిళలతో ప్రత్యేకంగా సమావేశమై సైబర్ మోసాలు, ఫేక్ లోన్ యాప్‌లు, నకిలీ లింకులు, ఓటీపీ మోసాలు, సోషల్ మీడియా మోసాలు వంటి అంశాలపై జాగ్రత్తలు వివరించారు. అపరిచిత కాల్స్, మెసేజ్‌లు, అనుమానాస్పద లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు.అలాగే మహిళల భద్రత, ఈవ్‌టీజింగ్ నివారణ, చిన్నారుల రక్షణ, మహిళలపై నేరాల నివారణ అంశాలపై అవగాహన కల్పిస్తూ, వేధింపులు లేదా అనుమానాస్పద ఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. మహిళలు భయపడకుండా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.రోడ్డు భద్రతలో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, అతివేగం నివారించడం, హెల్మెట్ ధరించడం, నిర్లక్ష్య డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, వాటికి దూరంగా ఉండాలని హెచ్చరించారు. ప్రజల సహకారంతోనే నేర రహిత, సురక్షిత సమాజ నిర్మాణం సాధ్యమని మార్కాపురం జిల్లా పోలీసులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *