ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల్లో భాగంగా జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు గారి ఆదేశాల మేరకు బుధవారం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌తో పాటు పలు పోలీస్ స్టేషన్లలో పోలీస్ అధికారులు, సిబ్బందికి హైపర్ టెన్షన్‌ (ప్ర‌పంచ ర‌క్త‌పోటు దినోత్స‌వం)పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందికి యోగా, మెడిటేషన్ కార్యక్రమాలు నిర్వహించి ఆరోగ్య పరిరక్షణపై పలు సూచనలు తెలియచేసారు.ఒంగోలు ఏఆర్ డీఎస్పీ కె. శ్రీనివాసరావు మాట్లాడుతూ యోగా, మెడిటేషన్ మానసిక ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రత, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని తెలిపారు. విధి నిర్వహణలో ఎదురయ్యే శారీరక, మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.
ఒంగోలులో హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ శ్రీరామచంద్ర మిషన్‌కు చెందిన భాస్కర్ రెడ్డి మరియు ఏ. విజయ లక్ష్మి గార్లు మాట్లాడుతూ హృదయంపై ధ్యానం చేయడం ద్వారా మానసిక, శారీరక, భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక పరమైన అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లు, సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని ధ్యానం పెంపొందిస్తుందని పేర్కొన్నారు. అలాగే మంచి నిద్ర, సానుకూల ఆలోచనా విధానం, ప్రశాంతమైన మనసు మరియు సంకల్పశక్తి పెంపొందించుకోవడంలో మెడిటేషన్ ఎంతో ఉపయోగకరమని వివరించారు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, సమతుల ఆహారం తీసుకోవడం, నిత్య వ్యాయామం చేయడం ద్వారా రక్తపోటును నియంత్రించవచ్చన్నారు.అలాగే, పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో ఎదుర్కొనే ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని మానసిక ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఆరోగ్యకర జీవనశైలి ద్వారా గుండె సంబంధిత వ్యాధులను దూరం చేసుకోవచ్చని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఐ లు రమణారెడ్డి, సీతారామిరెడ్డి, ఆర్ఎస్సైలు ప్రసాద్, మాల్యాద్రి, తిరుపతి స్వామి మరియు సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *