తొలి శుభోదయం న్యూస్ కంభం:-
బుధవారం దేశవ్యాప్తంగా ఇండియన్ మెడికల్ అండ్ డ్రగ్గిస్ట్ డీలర్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈరోజు కంభం సబ్ డివిజన్లోని మెడికల్ స్టోర్స్ నిర్వాహకులు స్వచ్ఛందంగా ఈరోజు మెడికల్ స్టోర్స్ బంద్ చేసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రియా కార్డు ప్రదర్శిస్తూ ఆన్లైన్ అమ్మకాలు వెంటనే నిషేధించాలని, నకిలీ మందుల కంపెనీల తయారీని నిషేధించాలని, కార్పొరేట్ సంస్థల అడ్డగోలు డిస్కౌంట్లను నియంత్రించాలని, నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న జీవోలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అనంతరం భారీ మానవహారం నిర్వహించారు.భారీ ర్యాలీతో చౌక్ సెంటర్ నుండి బస్ స్టాండ్ మీదుగా మండల తహశీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కిరణ్ కు డిమాండ్లతో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ABC మండలాల మెడికల్ స్టోర్స్ నిర్వాహకులు పాల్గొన్నారు.