ప్రకాశం జిల్లా పోలీసులు వి.వి.పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండసముద్రం గ్రామంలో జూదంపై ప్రత్యేక దాడి నిర్వహించారు. ఈ దాడిలో జూదానికి పాల్పడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి రూ.4,200 నగదును స్వాధీనం చేసుకున్నారు.అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడం, శాంతి భద్రతలను పరిరక్షించడం లక్ష్యంగా ఇలాంటి ప్రత్యేక దాడులు నిరంతరం కొనసాగుతాయని ప్రకాశం జిల్లా పోలీసులు తెలిపారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు తమ పరిసరాల్లో జరుగుతున్న జూదం, ఇతర అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *