ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. విద్యార్థులు ఎలాంటి భయాందోళనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయేందుకు జిల్లా వ్యాప్తంగా పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.పరీక్షా కేంద్రాల పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచడంతో పాటు శాంతిభద్రతా పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద అనవసర రద్దీ, అసాంఘిక కార్యకలాపాలు, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు అమలు చేస్తున్నారు.పరీక్షల సమయంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ప్రశాంత వాతావరణం నెలకొనేలా కేంద్రాల పరిసరాల్లో గస్తీ చర్యలను మరింత బలోపేతం చేశారు. తల్లిదండ్రులు, ప్రజలు పరీక్షా కేంద్రాల వద్ద రద్దీ సృష్టించకుండా సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పరీక్షలు సజావుగా జరిగేలా అవసరమైన అన్ని భద్రతా చర్యలు తీసుకున్నామని, ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *