కందుకూరు పట్టణంలో అనారోగ్యంతో బాధపడుతున్న పలువురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఇళ్లకు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు స్వయంగా వెళ్లి పరామర్శించారు.
పోతురాజుమిట్ట ప్రాంతంలో షేక్ మునీర్, సమీరా దంపతుల కుమార్తె ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురికాగా, ఎమ్మెల్యే గారు వివరాలు తెలుసుకొని, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అదే ప్రాంతంలో అనారోగ్యంతో బాధపడుతున్న రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి బెజవాడ ప్రసాద్ తండ్రి వెంకటేశ్వర్లును ఎమ్మెల్యే గారు పరామర్శించారు.పట్టణ ఐటీడీపీ అధ్యక్షుడు చుంచు వేణు, ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడగా, కోవూరు రోడ్డులోని అతని ఇంటికి వెళ్లి పరామర్శించారు.2వ వార్డు టిడిపి అధ్యక్షుడు షేక్ నాగూర్ అనారోగ్యంతో ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా, ఆయనను ఎమ్మెల్యే పరామర్శించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *