శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, పెండింగ్ కేసుల పురోగతి సమీక్ష మరియు పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా అమలు చేయడం లక్ష్యంగా కందుకూరు డీఎస్పీ గారు కందుకూరు డీఎస్పీ కార్యాలయంలో సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్సైలతో నెలవారీ క్రైమ్ మీటింగ్ నిర్వహించారు.ఈ సమావేశంలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల పరిష్కారం, నేర నియంత్రణ చర్యలు, శాంతి భద్రతా పరిస్థితులు, అసాంఘిక కార్యకలాపాల అరికట్టడం వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. నేరాలపై వేగవంతమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.అదేవిధంగా సైబర్ నేరాలు, మహిళలు మరియు చిన్నారులపై నేరాలు, రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలన, జూదం మరియు ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగించాలని ఆదేశించారు. ప్రజలతో మరింత సమన్వయంతో కమ్యూనిటీ పోలీసింగ్‌ను బలోపేతం చేసి ప్రజల్లో భద్రతా భావన పెంపొందించాలని సూచించారు.ప్రతి పోలీస్ అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి నేరరహిత, శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు కృషి చేయాలని కందుకూరు డీఎస్పీ సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *