మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. స్వామివారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నాను.దర్శనం అనంతరం ఆలయ పరిసరాల్లో భక్తుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను స్వయంగా పరిశీలించాను..క్యూలైన్లు, మంచినీటి వసతి, అన్నప్రసాదం నాణ్యతను అడిగి తెలుసుకున్నాను.భక్తులు సమర్పించే విరాళాలు, వస్తువులను వృధా చేయకుండా సద్వినియోగం చేయాలని అధికారులను ఆదేశించాను.లగేజీ పాయింట్, చెప్పుల స్టాండ్ వద్ద కొందరు భక్తుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. భక్తులను ఇబ్బంది పెట్టి, అధిక రేట్లు వసూలు చేస్తే సహించేది లేదు. నిబంధనలు అతిక్రమిస్తే పాటదారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నాను.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *