కందుకూరులో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. భారీ ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది. బలమైన గాలుల ధాటికి పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడగా, కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.భారీ గాలుల కారణంగా రోడ్లపై ప్రయాణిస్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు వర్షం, ఈదురుగాలుల నుంచి రక్షణ కోసం దుకాణాలు, షెడ్ల వద్ద ఆశ్రయం పొందాల్సి వచ్చింది. మార్కెట్ ప్రాంతాల్లో వ్యాపారులు తమ సరుకులను రక్షించేందుకు హడావుడిగా చర్యలు చేపట్టారు.
అకాలంగా కురిసిన ఈ వర్షం ప్రజలకు ఒకవైపు ఉపశమనం కలిగించినప్పటికీ, మరోవైపు భారీ ఈదురుగాలులు ఆందోళన కలిగిస్తున్నాయి. అధికారులు ప్రజలు అవసరం లేకుండా బయటకు రావద్దని, ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద నిలబడకూడదని హెచ్చరిస్తున్నారు. రైతులు కూడా గాలివాన ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *