google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తరచూ రోడ్డు ప్రమాదాలతో రక్తమూడుతున్న జాతీయ రహదారి 16 పై ముందస్తు చర్యలు చేపట్టేందుకు జిల్లా ఎస్పీ హర్షవర్ధన రాజు ఆదేశాలతో పోలీస్ శాఖ, రవాణా శాఖ, జాతీయ రహదారి అధారిటీ ఇంజనీరింగ్ అధికారులు మంగళ వారం సింగరాయకొండ, టంగుటూరు పోలీస్ స్టేషన్ ల పరిధిలో క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు.ప్రత్యేకించి 16 వ నంబర్ జాతీయ రహదారి పై సింగరాయకొండ సమీపం లోని ఎమర్జెన్సీ లాండింగ్ ప్రదేశం లో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడం, రక్తసిక్తం అవుతున్న పరిస్థితుల పరిష్కారం కోసం చర్యలు చేపట్టారు. ప్రత్యేకించి కనుమళ్ళ రోడ్డు ఆంజనేయ కూడలి,ప్రాంతం ప్రమాద ప్రదేశంగా గుర్తించి అక్కడ ఎటువంటి రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోకుండా అప్రాంతలలో హెచ్చరిక బోర్డులు, స్పీడ్ కంట్రోల్ హెచ్చరికలు,ప్రమాద హెచ్చరిక బోర్డ్ లు ఇతర అవసరమైన సంకేతాలు ఏర్పాటు అవసరం పై ఒంగోలు డి ఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, రవాణా శాఖ ఉప కమీషనర్ ఆర్ సుశీల,16 నంబర్ జాతీయ రహదారి సంస్థ ఇంజనీర్ యశ్వంత్ రెడ్డి, సింగరాయకొండ సి ఐ శ్రీహరి, ఎస్సై సుధీర్ కుమార్ లు ఆ ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించి చేపట్టాల్సిన చర్యల గురించి సమీక్షించారు. సమీక్ష పరిశీలన అనంతరం రోడ్డు ప్రమాదాలు నివారణకు అవసరమైన, సమీక్షించి గుర్తించిన వేగ నియంత్రణ హెచ్చరిక్ బోర్డ్ లు,హెచ్చరిక బోర్డు లు, ప్రమాద ప్రాంతాల గుర్తింపు,హెచ్చరిక బోర్డర్ లు ఏర్పాటు చెయ్యాలని సంబంధిత పోలీస్ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా సింగరాయకొండ, టంగుటూరు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed