కందుకూరు పట్టణంలోని 6వ వార్డు క్లస్టర్ మహానాడు కార్యక్రమం ఈ నెల 27, 28 తేదీలలో పామూరు రోడ్డులోని తిరుమల లక్ష్మీ బాలాజీ కళ్యాణ మండపంలో నిర్వహించనున్న సందర్భంగా, కందుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారి ఆదేశాల మేరకు 24వ వార్డు తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు మదిర మధు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి తగు కార్యాచరణపై చర్చించారు.ఈ సందర్భంగా, గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కందుకూరును నెల్లూరు జిల్లా నుంచి తిరిగి ప్రకాశం జిల్లాలో కలిపేందుకు విశేష కృషి చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.అలాగే, కందుకూరు పట్టణంలో ఎన్నడూ లేని విధంగా డివైడర్ సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయడంతో పాటు స్విమ్మింగ్ పూల్ తిరిగి ప్రారంభించడం, నూతన పార్కులు ఏర్పాటు చేయడం తో పాటు ప్రతి వార్డులో అంతర్గత రోడ్లు, కాలువల నిర్మాణం చేపట్టి పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరావు గారికి కృతజ్ఞతలు తెలిపారు.ఇప్పటివరకు 24వ వార్డులో పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లక్షల రూపాయల సహాయం అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఎమ్మెల్యే గారికి లబ్ధిదారుల కుటుంబాలు ధన్యవాదాలు తెలియజేశాయి.6వ వార్డు క్లస్టర్ స్థాయిలో నిర్వహిస్తున్న మహానాడులో మన వార్డు నుంచి అత్యధిక సంఖ్యలో ప్రజలు, ముఖ్యంగా మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు నిర్ణయించారుకందుకూరు నియోజకవర్గంలో బడుగు, బలహీన వర్గాలకు గతంలో ఏ రాజకీయ నాయకుడు ఇవ్వని స్థాయిలో గుర్తింపు, ప్రోత్సాహం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు అందిస్తున్నారని వార్డులోని బీసీ సోదరులు కృతజ్ఞతలు తెలిపారు.అలాగే, వార్డులోని మసీదు నుంచి గురంవారి పాలెం రోడ్ డౌన్ వరకు నూతన కాలువ నిర్మాణం చేపట్టడంతో పాటు, కొన్ని కాలువలను మరమ్మతు చేయాలని, అలాగే రెండు చోట్ల కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు24 వాడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మదిర మధు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వార్డు నాయకులు కొండలరావు బాచి వెంకటేశ్వర్లు రమేష్ పాపయ్య మణికంఠ తదితరులు పాల్గొన్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *