google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తనిఖీ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ విధులకు గైర్హాజరుగా ఉండటం, ఇద్దరు వైద్యులు ఉండాల్సిన చోట ఒక్క వైద్యుడు మాత్రమే అందుబాటులో ఉండటం గమనించాను. ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత ఉన్న వైద్యులు విధులకు హాజరు కాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాను. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకునేలా ఫిర్యాదు చేస్తాను.అదేవిధంగా ఆసుపత్రిలోని ఓపీ విభాగం, ల్యాబ్, ఇతర సౌకర్యాలను పరిశీలించి, వైద్య సేవల నాణ్యతపై ఆరా తీశాను. ఆసుపత్రి సిబ్బంది మరింత బాధ్యతతో వ్యవహరించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించాను.ఆసుపత్రి ప్రాంగణంలో గత ప్రభుత్వానికి సంబంధించిన పోస్టర్లు ఇంకా కొనసాగుతుండటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం మారి రెండేళ్లు అవుతున్నా వాటిని తొలగించకపోవడంపై ప్రశ్నించాను.దొనకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో మరిన్ని వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని, ఆసుపత్రి పరిస్థితులపై సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్ గారికి అందజేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed