google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

పాఠశాల విద్యార్థుల సంరక్షణ ప్రమాదాల బారి నుండి పరిరక్షించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాల బస్సుల నిర్వాహకులు తప్పనిసరిగా ఎ ఐ ఎస్ -63 నిబంధనలు పాటించాలని దానికి భిన్నంగా ఎవరయినా స్కూల్ బస్సులు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని డి టి సి ఆర్ సుశీల హెచ్చరించారు. పాఠశాలలకు వచ్చే విద్యార్థులు, ప్రయాణీకుల భద్రత అత్యంత ప్రధానంగా ప్రతి పాఠశాల నిర్వాహకులు బాధ్యత తీసుకోవాలని ఆమె కోరారు. పాఠశాలలు పున: ప్రారంభ అయిన సందర్భంగా రవాణాశాఖ అనుమతి లేకుండా ఎవరయినా స్కూల్ బస్సులు నడిపితే చట్టపరమైన తప్పవని డి టి సి హెచ్చరించారు.ప్రతి స్కూల్ బస్ లో నిబంధనల ప్రకారం సీటింగ్,స్పీడ్ లిమిట్,ప్యానిక్ బటన్,వి ఎల్ టి డి తప్పనిసరిగా బిగించాలని ఆమె సూచించారు. అంతే కాకుండా స్కూల్ బస్సు నడిపే డ్రైవర్ కి కనీసం ఐదు సంవత్సరాలు అనుభవం కలిగి ,అరవై సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలని సూచించారు. ప్రతి బస్ లో తప్పకుండా అత్యవసర చికిత్స కిట్ బాక్స్,అత్యవసర ద్వారం,అటెండెంట్ తప్పనిసరిగా ఉండాలని దానికి భిన్నంగా నడిపే బస్ లకు అనుమతి ఉండదన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాల బస్ లు నడప కుండా నిబంధనలకు భిన్నంగా నడిపితే అలాంటి బస్ లను సీజ్ చేయడం జరుగుతుందన్నారు. పోలీస్ శాఖ, రవాణా శాఖ, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో స్కూల్ బస్ ల పై నిరంతరం దృష్టి పెట్టాలని ఆమె కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *