తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ట్రాఫిక్ సీఐ గారి ఆధ్వర్యంలో మస్తాన్ దర్గా నుండి కొత్తపట్నం బస్ స్టాండ్ వరకు రహదారులపై అక్రమంగా ఏర్పాటు చేసిన ఆక్రమణలను తొలగించారు. అలాగే కొత్తపట్నం బస్ స్టాండ్ పరిసరాల్లో కూడా ట్రాఫిక్‌కు ఆటంకం కలిగిస్తున్న ఆక్రమణలను తొలగించి రహదారులను పూర్తిగా స్వేచ్ఛగా మార్చారు.ఈ చర్యలతో వాహనదారులు, పాదచారులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా ప్రయాణించే అవకాశం కలిగింది. ప్రజా రహదారులను ఆక్రమించడం చట్టవిరుద్ధమని, వ్యాపారులు మరియు ప్రజలు స్వచ్ఛందంగా రహదారులను ఆక్రమించకుండా సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రత్యేక తనిఖీలు, ఆక్రమణల తొలగింపు కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.