google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ. నెం. 396 ద్వారా రిజిస్ట్రేషన్ శాఖ సేవలను ప్రైవేటీకరించి, ప్రైవేట్ సంస్థల ద్వారా నిర్వహించే విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలకు అనుబంధంగా పనిచేస్తున్న డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్లు మరియు ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
జి.ఓ.396 అమలులోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్లు మరియు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న సుమారు ఐదు లక్షల కుటుంబాల జీవనోపాధి ప్రమాదంలో పడే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేస్తూ కందుకూరు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద పెన్‌డౌన్ నిరసన కార్యక్రమం చేపట్టారు..13,14,15 ఈ మూడు రోజులు నిరసన కొనసాగుతుంది అన్నారు. జీవనోపాధిని కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే జి.ఓ. నెం. 396ను రద్దు చేసి, డాక్యుమెంట్ రైటర్లు మరియు స్టాంప్ వెండర్ల ప్రయోజనాలను పరిరక్షించాలని వారు విజ్ఞప్తి చేశారు.
అలాగే తమ సమస్యను ప్రజలకు, ప్రభుత్వానికి చేరవేయడంలో మీడియా ప్రతినిధులు సహకరించాలని డాక్యుమెంట్ రైటర్లు మరియు స్టాంప్ వెండర్లు కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed