google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా పోలీసులు జిల్లాలోని రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్లు మరియు ఇతర రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రయాణికుల సామాన్లు, అనుమానాస్పద వస్తువులు, అనుమానాస్పద వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసి, భద్రతా పరమైన అన్ని అంశాలను పరిశీలించారు. ప్రజలు అధికంగా రాకపోకలు సాగించే ప్రాంతాల్లో పోలీసు నిఘాను మరింత పటిష్టం చేసి, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.ప్రజలు అపరిచిత వ్యక్తులు, యజమాని లేని బ్యాగులు లేదా అనుమానాస్పద వస్తువులు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రయాణికుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ప్రకాశం జిల్లా పోలీసులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed