google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ప్రకాశం జిల్లా కొండపి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం మంజూరు చేసిన 381 ఎలక్ట్రికల్ స్టవ్‌లను రాష్ట్ర సామాజిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం త్వరితగతిన అందించేందుకు ప్రభుత్వం అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తోందన్నారు. ఎలక్ట్రికల్ స్టవ్‌ల వినియోగంతో వంట ప్రక్రియ సులభతరం కావడంతో పాటు సమయం ఆదా అవుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలు, చిన్నారుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అంగన్వాడీ సేవలను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed