గిద్దలూరు, మార్కాపురం జిల్లా గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఆధ్వర్యంలో “అవినీతిపై విద్యార్థినులకు అవగాహన సదస్సు” మార్కాపురం జిల్లా, గిద్దలూరు పట్టణ శివారులోని ప్రభుత్వ గురుకుల బాలికల పాఠశాలలో ప్రిన్సిపాల్ శ్రీమతి లక్ష్మీదేవి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన విభాగం (పురుషులు & మహిళలు) వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ మాగులూరి శ్రీకాంత్ యోగా & సామాజిక సేవా విభాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు శ్రీ బి.ఎస్. నారాయణరెడ్డి గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థులు అవినీతి, అక్రమాలకు దూరంగా ఉండి నిజాయితీ, నైతిక విలువలు, ధర్మబద్ధమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. కుటుంబం, గ్రామం, సమాజం మరియు దేశ అభివృద్ధికి బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఎక్కడ అన్యాయం జరిగినా ధైర్యంగా ప్రశ్నించే వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలని, ముఖ్యంగా వినియోగదారుల హక్కుల పరిరక్షణలో భాగంగా ఏ వస్తువు కొనుగోలు చేసినా తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని విద్యార్థినులకు అవగాహన కల్పించారు.
అనంతరం ప్రిన్సిపాల్ శ్రీమతి లక్ష్మీదేవి యోగా & సామాజిక సేవా విభాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు శ్రీ బి.ఎస్. నారాయణరెడ్డి గ యువ ప్రగతి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు శ్రీ ఎస్.డి. ఫరూక్ కలిసి మాగులూరి శ్రీకాంత్ గారిని విద్యార్థినుల చేత శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో యువ ప్రగతి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు శ్రీ ఎస్.డి. ఫరూక్ గారు, పాఠశాల ఉపాధ్యాయినులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ & కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *