తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:-
ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు, జిల్లా ఎస్పీల ఆదేశాల మేరకు గ్రామాలు, విద్యాసంస్థలు మరియు ప్రజలు అధికంగా గుమికూడే ప్రాంతాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమాల్లో మహిళల సాధికారత, మహిళలు మరియు చిన్నారుల భద్రత, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, ఈవ్‌టీజింగ్ నివారణ, సైబర్ నేరాలు, OTP/ఆన్లైన్ మోసాలు, రోడ్డు భద్రత, మైనర్లు వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలు, గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, దొంగతనాల నివారణ, ట్రాన్స్ఫార్మర్ దొంగతనాల నిరోధం వంటి అంశాలపై ప్రజలకు, మహిళలకు, విద్యార్థులకు మరియు రైతులకు సమగ్ర అవగాహన కల్పించారు.పోలీసులు ప్రజలతో నేరుగా మమేకమై ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, అపరిచితుల ఫోన్ కాల్స్, లింకులు, OTPల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గంజాయి వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, అక్రమ మాదకద్రవ్యాల విక్రయం లేదా రవాణా గురించి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.అలాగే రైతులకు ట్రాన్స్ఫార్మర్ దొంగతనాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించి, అనుమానాస్పద వ్యక్తులు లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలు గమనించిన వెంటనే డయల్ 112 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు.ప్రజల సహకారంతో సురక్షితమైన, నేరరహిత సమాజ నిర్మాణమే పోలీసుల లక్ష్యమని ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు తెలిపారు.