వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు, మాజీ శాసనసభ్యులు కె.పి.నాగార్జున రెడ్డి గఆధ్వర్యంలో గిద్దలూరు నియోజకవర్గం గిద్దలూరు పట్టణంలో గాంధీబొమ్మ సెంటర్ నుండి పొట్టిశ్రీరాములు విగ్రహం మీదుగా రాచర్ల గేట్ సెంటర్ లోని వై.యస్.ఆర్. గారి విగ్రహఓ వరకు భారీ జనసందోహం మధ్య డీఎస్సీ అక్రమాలకు నిరసనగా ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.డీఎస్సీ అభ్యర్థులు, విద్యార్థులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *